అరిహంత్ తరగతి జలాంతర్గామి
దస్త్రం:INS Arihant during sea trials.jpg INS Arihant during sea trials in 2014
| |
Class overview | |
---|---|
Name: | అరిహంత్ |
Builders: | నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్, విశాఖపట్నం[1] |
Operators: | మూస:Country data భారత్ |
In commission: | 2016 |
Building: | 3[2] |
Completed: | 1 (కమిషన్ కు సిద్ధంగా ఉంది) |
General characteristics | |
Type: | అణు చోదిత, అణ్వాయుధ సహిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి |
Displacement: | 6,000 టన్నులు (5,900 long tons; 6,600 short tons) surfaced[3] |
Length: | 112 మీ. (367 అ.)[3] |
Beam: | 11 మీ. (36 అ.) |
Draft: | 10 మీ. (33 అ.) |
Installed power: | 1 × pressurised water reactor[4] *83 MW (111,000 hp) |
Propulsion: | 1 × propeller shaft *Nuclear |
Speed: | నీటిపైన: 12–15 knots (22–28 km/h) *నీటి అడుగున: 24 knots (44 km/h) |
Range: | unlimited except by food supplies |
Test depth: | 300 మీ. (980 అ.) |
Complement: | 95 |
Sensors and processing systems: | USHUS sonar |
Armament: | క్షిపణులు: 12 × సాగరిక/K15 SLBM (750–1900 కిమీ పరిధి) లేదా 4 × K-4 SLBM (3500 కిమీ పరిధి)[4] టార్పెడోలు: 6 × 21" (533 mm) torpedo tubes – est 30 charges (torpedoes, cruise missiles or mines)[5] |
అరిహంత్ ఒక అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల తరగతి. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికిల్ ప్రాజెక్టు కింద భారత్ ఈ జలాంతర్గాములను తయారుచేస్తోంది. ఈ తరగతి లోని ముఖ్య జలాంతర్గామి INS అరిహంత్ ప్రారంభం 2009 లో జరిగింది. విస్తృత సముద్ర పరీక్షల తరువాత, 2016 ఫిబ్రవరి 23 న ఇది ఆపరేషన్లకు సిద్ధంగా ఉందని నిర్ధారించారు .[6][7] ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి శాశ్వత సభ్యులు ఐదుగురు కాకుండా, ఇతర దేశాలు తయారుచేసిన మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి అరిహంత్.[8]
చరిత్ర
[మార్చు]1971 డిసెంబరులో, భారత్ పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా అమెరికా, టాస్క్ ఫోర్స్ 74 అనే తన బలగాలను USS ఎంటర్ప్రైస్ నాయకత్వంలో బంగాళాఖాతంలో మోహరించింది. భారత్‌ను హెచ్చరించేందుకు అమెరికా ఈ పనిచేసింది.[9][10] దీనికి ప్రతిగా సోవియట్ యూనియన్ అణ్వాయుధాలతో కూడిన తన జలాంతర్గామిని అమెరికా టాస్క్ ఫోర్స్ వెనుకనే పంపించింది.[11] అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ప్రాముఖ్యత ఎంతటిదో ఈ సంఘటనతో నాటి ప్రధాని ఇందిరా గాంధీకి తెలియవచ్చింది.[12] 1974 నాటి స్మైలింగ్ బుద్ధ అణు పరీక్ష తరువాత, డైరెక్టర్ ఆఫ్ మెరీన్ ఇంజనీరింగ్ (DME) దేశీయ అణు చోదిత వ్యవస్థను నిర్మించడమై, సాధ్యాసాధ్యాల పరిశీలనను చేపట్టారు. (Project 932).[13] అణు జలాంతర్గామికి రూపకల్పన చేసి నిర్మించే, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ ప్రాజెక్టు 1990 ల్లో రూపుదిద్దుకుంది.[14] 1998 లో నాటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఈ ప్రాజెక్టు ఉనికిని ధ్రువీకరించాడు.[15] ప్రాజెక్టు యొక్క తొలి ఉద్దేశం, వేగంగా దాడి చేసే అణు చోదిత జలాంతర్గామిని నిర్మించడం. అయితే 1998 అణు పరీక్షల తరువాత, భారత్ మొదటి-దాడి-చెయ్యను విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రాజెక్టు లక్ష్యాలను మార్చి, బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామిని నిర్మించాలని నిశ్చయించారు. ఇది భారత్ యొక్క అణుత్రయంలో ఒక భాగం.[16][17][18]
వివరణ
[మార్చు]అరిహంత్ తరగతి జలాంతర్గాములు అణు చోదిత బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు. దీని నిర్మాణాన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సెల్ (ATV) ప్రాజెక్టులో భాగంగా చేపట్టారు.[19][20][21][22][23][24] ఇవి భారత్ నిర్మించిన మొదటి అణు చోదిత జలాంతర్గాములౌతాయి[25] ఈ జలాంతర్గాములు 112 మీ పొడవు, 11 మీ బీమ్‌తో, 10 మీ డ్రాట్‌తో, 6000 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి సముద్రంలో 300 మీ లోతు వరకు వెళ్తాయి. 95 మంది సిబ్బంది ఉంటారు.[26] ఈ జలాంతర్గాములు 83 మెగావాట్ల ప్రెజర్ వాటర్ రియాక్టరుతో నడుస్తాయి. ఇది నీటిపైన 12-15 నాట్ల వేగంతోను, నీటి లోపల 24 నాట్ల వేగంతోనూ ప్రయాణిస్తుంది.[26]
ఈ జలాంతర్గాములకు నాలుగు క్షిపణి ప్రయోగ ట్యూబులు ఉన్నాయి. దీనిలో 12 సాగరిక క్షిపణులను గానీ (750 కిమీ పరిధి) లేదా 4 K-4 క్షిపణులను గానీ (3,500 కిమీ పరిధి) మోహరించవచ్చు.[27][28] ఈ జలాంతర్గాములు రష్యా యొక్క అకులా తరగతి జలాంతర్గాముల కోవకు చెందినవి.[26] భారత నావికా దళం తన సైనికులకు అకులా తరగతికి చెందిన INS చక్రలో శిక్షణ ఇస్తుంది..[29][30]
అభివృద్ధి
[మార్చు]ఈ జలాంతర్గాములకు శక్తి, ప్రెషరైస్‌డ్ వాటర్ రియాక్టరు నుండి లభిస్తుంది. ఈ రియాక్టరు హైలీ ఎన్రిచ్డ్ యురేనియాన్ని ఇంధనంగా వాడుతుంది.[31][32] ఈ రియాక్టరును భాభా అటామిక్ రీసెర్చి సెంటర్ (BARC) రూపకల్పన చేసి, నిర్మించింది. దీన్ని ఇందిరాగాంధి అణు పరిశోధన కేంద్రం, కల్పాక్కం లో నిర్మించారు.[33] ఇందులో రియాక్టరు, నీటి ట్యాంకు, కంట్రోల్ రూము, ఆక్జిలరీ కంట్రోల్ రూము ఉన్నాయి.[34] ప్రోటోటైప్ రియాక్టరు 2003 నవంబరు 11 న క్రిటికల్ స్థితికి చేరింది. 2006 సెప్టెంబరు 22 న అది ఆపరేషన్‌కు సిద్ధమైందని ప్రకటించారు.[12] మూడేళ్ళ పాటు ఈ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పని చేయించాక, అరిహంత్ కోసం రియాక్టరును తయారు చేసారు.[35][36] రియాక్టరు ఉప వ్యవస్థలను విశాఖపట్నం లోని యంత్ర పరీక్షా కేంద్రంలో పరీక్షించారు.[37] జలాంతర్గాములలో ఇంధనాన్ని ఎక్కించడానికి, పాత ఇంధనాన్ని తీసేసేందుకు అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసారు.[12]
జలాంతర్గామి డిజైను యొక్క సవివరమైన ఇంజనీరింగ్ ను ఎల్ & టి వారి హజీరా నౌకా నిర్మాణ కేంద్రంలో చేసారు.[38] జలాంతర్గామి నియంత్రణ వ్యవస్థలను టాటా పవర్ నిర్మించింది.[39] స్టీమ్ టర్బైన్లు, దానికి సంబంధించిన వ్యవస్థలను వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ సరఫరా చేసింది.[40] 2009 జూలైలో ప్రారంభించాక, మొదటి నౌక, అరిహంత్ అనేకానేక పరీక్షలకు లోనైంది.[41] ప్రొపల్షన్, పవర్ వ్యవస్థలను హై ప్రెషర్ స్టీమ్‌తో పరీక్షించారు. అనేక హార్బరు పరీక్షలు కూడా జరిపారు.[42] INS అరిహంత్ యొక్క రియాక్టరు 2013 ఆగస్టు 10 న క్రిటికల్ స్థితికి చేరింది.[43][44][45]
ఈ తరగతి లోని నౌకలు
[మార్చు]ఈ తరగతిలో ఎన్ని జలాంతర్గాములను నిర్మిస్తారనేది ఇదమిత్థంగా తెలీదు. మీడియా రిపోర్టుల ప్రకారం 3 నుండి 6 వరకూ నిర్మిస్తారని తెలుస్తోంది.[46][47][48][49][50][51][52] ఈ తరగతిలోని మొదటి జలాంతర్గామి INS అరిహంత్ 2016 లో కమిషన్ అయ్యే అవకాశాలున్నాయి.[53] 2023 నాటికి మొదటి నాలుగు జలాంతర్గాములు కమిషన్ అవుతాయి.[4] 2014 డిసెంబరు నాటికి రెండవ అణు రియాక్టరు పని మొదలైంది. రెండవ జలాంతర్గామి, INS అరిదమన్ సముద్ర పరీక్షలకు సిద్ధం అవుతోంది.[54] అరిహంత్ తరువాత తయారయ్యే మూడు నౌకలు అరిహంత్ కంటే పెద్దవి, 8 కె-4 క్షిపణులను మోసుకుపోగలిగే సామర్థ్యంతో, మరింత శక్తివంతమైన అణు రియాక్టరును కలిగి ఉంటాయి.
అరిహంత్ తరగతి తరువాత మరింత పెద్ద తరగతి నౌకలను తయారు చెయ్యాలనే ప్రణాళిక కూడ ఉంది. ఈ తరగతి జలాంతర్గాములు 12 నుండి 16 బాలిస్టిక్ క్షిపణులను మోహరించగలవు.[55][56]
పేరు | పతాక | ప్రారంభం | సముద్ర పరీక్షలు | కమిషన్ | స్థితి |
---|---|---|---|---|---|
INS అరిహంత్ | S 73 / S2[56][57] | 2009 జూలై 26 | 2014 డిసెంబరు 13 [58] | 2016 (అనుకోలు)[59] | సముద్ర పరీక్షలు[6] |
INS అరిదమన్ | S 74 / S3[56] | tbd | tbd | tbd | నిర్మాణంలో ఉంది[4][60] |
tbd | నిర్మాణంలో ఉంది[61] | ||||
tbd | నిర్మాణంలో ఉంది |
టైమ్‌లైన్
[మార్చు]తేది | ఘటన |
1998 మే 19 | ATV ప్రాజెక్టును అప్పటి రక్షణ మంత్రి ధ్రువీకరించాడు |
2003 నవంబరు 11 | ప్రోటోటైప్ అణు రియాక్టరు క్రిటికల్ అయింది |
2006 సెప్టెంబరు 22 | అణు రియాక్టరు ఆపరేషనుకు సిద్ధమైందని ప్రకటన |
2009 జూలై 26 | INS అరిహంత్ ప్రారంభం |
2013 ఆగస్టు 10 | అరిహంత్ అణు రియాక్టరు క్రిటికల్ అయింది |
2014 డిసెంబరు 13 | INS అరిహంత్ సముద్ర, ఆయుధ పరీక్షలు ప్రారంభం |
2015 నవంబరు 25 | INS అరిహంత్ డమ్మీ B5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. |
2016 మార్చి 31 | క్షిపణిని కె 4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు వనరులు
[మార్చు]- ↑ "Contract worker killed in accident at navy ship building centre". The Hindu. 8 March 2014. Retrieved 17 March 2016.
- ↑ "Why India needs submarines". The Diplomat. May 2016. Retrieved 17 May 2016.
- ↑ 3.0 3.1 "India reaches milestone with launch of n-powered submarine". DNA. 26 July 2007. Retrieved 24 January 2011.
- ↑ 4.0 4.1 4.2 4.3 "India to achieve N-arm triad in February". Times of India. 2 January 2012. Archived from the original on 26 మార్చి 2013. Retrieved 17 March 2016.
- ↑ Pike, John (27 July 2009). "Advanced Technology Vessel (ATV)". globalsecurity.org. Retrieved 24 January 2011.
- ↑ 6.0 6.1 "INS Arihant not to feature at International Fleet Review". The Economic Times. 5 February 2016. Archived from the original on 9 ఫిబ్రవరి 2016. Retrieved 5 February 2016.
- ↑ "India's first nuclear submarine INS Arihant ready or operations, passes deep sea tests". The Economic Times. 23 February 2016. Retrieved 23 February 2016.
- ↑ Marcus, Jonathan (10 August 2013). "Indian-built Arihant nuclear submarine activated". BBC. Retrieved 12 October 2013.
- ↑ "1971 War: How Russia sank Nixon's gunboat diplomacy". in.rbth.com. Archived from the original on 2016-06-13. Retrieved 2016-04-29.
- ↑ "US Fleet in Bay of Bengal: A game of deception". The Daily Star. 2013-12-15. Retrieved 2016-04-29.
- ↑ Krishnan Simha, Rakesh (20 December 2011). "US-Soviet Actions in 1971 Indo-Pakistani War". indrus.in. Indrus.in. Retrieved 22 April 2013.
- ↑ 12.0 12.1 12.2 "Arihant: the annihilator". Indian Defence Review. 25 October 2010. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 8 January 2012.
- ↑ Das, Premvir (30 July 2009). "Project 932". Business Standard. Retrieved 24 April 2013.
- ↑ "India's SNS Project Report". Fas.org. Retrieved 24 April 2013.
- ↑ "George defends position on China". Indian Express. 19 May 1998. Retrieved 24 February 2011.
- ↑ Pike, John. "Advanced Technology Vessel (ATV)". Globalsecurity.org. Archived from the original on 26 December 2010. Retrieved 24 January 2011.
- ↑ "First indigenous nuclear sub is inducted into the navy". DNA. 26 July 2009. Retrieved 24 January 2011.
- ↑ "India's nuclear sub still a distant dream". Rediff. 16 February 2001. Retrieved 24 January 2011.
- ↑ "Indian indigenous nuclear sub to be unveiled on 26 July: report". domain-b.com. 16 July 2009. Retrieved 24 January 2011.
- ↑ "India nuclear sub project near completion". Reuters. 12 February 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 24 January 2011.
- ↑ "PM to launch indigenous nuke submarine by month-end". MSN. 16 July 2009. Retrieved 19 July 2009.[permanent dead link]
- ↑ "Indigenous nuclear submarine goes on trial". The Hindu. Chennai, India. 19 July 2009. Archived from the original on 22 జూలై 2009. Retrieved 19 July 2009.
- ↑ Sud, Hari (14 August 2009). "India's nuclear submarine and the Indian Ocean". upiasia.com. Archived from the original on 28 జూలై 2011. Retrieved 24 January 2011.
- ↑ "India's nuclear submarine dream, still miles to go". Reuters. 31 July 2009. Archived from the original on 25 మే 2011. Retrieved 24 January 2011.
- ↑ "Final test of K-15 ballistic missile on Tuesday". 25 February 2008. Retrieved 24 January 2012.
- ↑ "The secret undersea weapon". India Today. 17 January 2008. Retrieved 8 January 2012.
- ↑ "The secret 'K' missile family". India Today. 20 November 2010. Retrieved 8 January 2012.
- ↑ "Arihant – Advanced Technology Vessel (ATV)". Global Security. Retrieved 8 January 2012.
- ↑ "Leased Russian n-submarine to set sail for India this month end". 15 December 2011. Retrieved 8 January 2012.
- ↑ Pandit, Rajat (17 July 2009). "India set to launch nuclear-powered submarine". Times Of India. Archived from the original on 24 అక్టోబరు 2012. Retrieved 17 March 2016.
- ↑ "High fissile fuel in nuclear submarine lasts long". The Hindu. Chennai, India. 5 November 2009. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 17 March 2016.
- ↑ "INS Arihant is an Indian design: Anil Kakodkar". The Hindu. Chennai, India. 16 August 2009. Archived from the original on 19 ఆగస్టు 2009. Retrieved 17 March 2016.
- ↑ Shekhar, G.C. (3 August 2009). "Unveiled: Arihant's elder brother". Telegraph India. Calcutta, India. Retrieved 17 March 2016.
- ↑ Subramanian, T.S. (2 August 2009). "PWR building shows indigenous capability". The Hindu. Chennai, India. Archived from the original on 8 ఆగస్టు 2009. Retrieved 17 March 2016.
- ↑ Venkatesh, M.R. (2 August 2009). "Arihant propulsion reactor unveiled". Hindustan Times. Retrieved 17 March 2016.[permanent dead link]
- ↑ "Naval Research Board". DRDO. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 17 March 2016.
- ↑ "Larsen and Toubro's Contribution to Arihant-class submarine"[permanent dead link] (PDF) (Press release). 26 July 2009.
- ↑ "India's first Indigenous nuclear submarine". Jeywin. Archived from the original on 17 ఫిబ్రవరి 2013. Retrieved 24 April 2013.
- ↑ "Private sector played a major role in Arihant". DNA. 27 April 2009. Retrieved 17 March 2016.
- ↑ "Nuclear submarine Arihant to be fitted with K-15 ballistic missiles". The Hindu. Chennai, India. 27 July 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 17 March 2016.
- ↑ "Home-made nuke sub INS Arihant to be inducted in 2 years". Times of India. 3 December 2009. Archived from the original on 13 జూన్ 2016. Retrieved 17 March 2016.
- ↑ "K-15 all set to join Arihant". The Hindu. 27 December 2012. Retrieved 17 March 2016.
- ↑ "India's nuclear submarine Arihant flagged off for sea trials". The Economic Times. 13 December 2014. Retrieved 15 December 2014.
- ↑ "INS Arihant sails out of harbour". The Hindu. 13 December 2014. Retrieved 15 December 2014.
- ↑ "Sea trials of Indian Navy's deadliest sub going 'Very Well'". The Diplomat. 31 May 2015. Retrieved 17 March 2016.
- ↑ Brewster, David. "Asia's coming nuclear nightmare". CFTNI. Retrieved 17 March 2016.
- ↑ "Was 2015 a good year for India's defence sector?". Business Standard. 31 December 2015. Retrieved 17 March 2016.
- ↑ "After Arihant, Indian Navy considering n-propulsion for Aircraft Carriers". indiastrategic.in. 31 December 2015. Archived from the original on 19 జనవరి 2016. Retrieved 17 March 2016.
- ↑ "SSBN Arihant Class Submarine". naval-technology.com. Retrieved 17 March 2016.
- ↑ "N-capable Arihant submarine successfully test-fires unarmed missile". Big News. Retrieved 17 March 2016.
- ↑ "Indian Navy soon to be the most formidable submarine force On The Planet". indiatimes.com. Retrieved 17 March 2016.
- ↑ "Satisfied with nuclear sub Arihant trials: Navy Chief". Tribune India. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 17 March 2016.
- ↑ "Work on second nuclear sub reactor begins". 2 December 2014. Archived from the original on 7 మే 2015. Retrieved 17 March 2016.
- ↑ "EXPRESS EXCLUSIVE: Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine". The New Indian Express. Archived from the original on 2016-04-08. Retrieved 2016-04-09.
- ↑ 56.0 56.1 56.2 Diplomat, Saurav Jha, The. "India's Undersea Deterrent". The Diplomat. Retrieved 2016-04-09.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "INS Arihant may be of limited utility". The Hindu (in Indian English). 2014-12-20. ISSN 0971-751X. Retrieved 2016-04-09.
- ↑ "INS Arihant sails out of harbor". The Hindu. 13 December 2014. Retrieved 22 December 2014.
- ↑ Anandan, S (23 February 2016). "Second nuclear submarine headed for year-end launch". The Economic Times. Retrieved 17 March 2016.
- ↑ "Second nuclear submarine under construction". IBN (in Hindi). 23 May 2011. Archived from the original on 15 ఏప్రిల్ 2015. Retrieved 17 March 2016.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "Maiden Test of Undersea K-4 Missile From Arihant Submarine". The New Indian Express. 9 April 2016. Archived from the original on 8 ఏప్రిల్ 2016. Retrieved 1 June 2016.